భారత్ లో ఇకపై ఆ మాట పలికితే నేరమే

కొన్ని దశాబ్దాలుగా భారతదేశ ముస్లిం సమాజంలో అమల్లో ఉన్న సత్వర విడాకుల ఆచారం త్రిపుల్ తలాక్ ఇకనుంచి తెరమరుగు కానుంది. మనదేశంలో ఏ ముస్లిం అయినా తలాక్ అనే మాట పలికితే అది నేరం అవుతుంది. అక్కడ పరిస్థితి తీవ్రతను బట్టి ఈ పదం పలికినుందుకు శిక్షలు కూడా అమల్లో ఉంటాయి. రాతపూర్వకంగా లేదా నోటి మాట ద్వారా లేదా మెసేజ్ రూపంలో తలాక్ అని మూడుసార్లు చెప్పి విడాకులు ఇవ్వడం ఇకపై కుదరదు. ఇలా చేయడం చట్టవిరుద్ధమని ఈ చట్టం పేర్కొంది. ఇలా చేసిన వారికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశముంది.