నకిలీ మద్యం తయారీ కేసులో వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం ఆయనను ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అరెస్ట్ చేశారు. జోగి రమేష్‌ను అరెస్ట్ చేస్తారని నిన్నటి నుంచి వదంతులు ఉన్నాయి. ఇవాళ ఉదయం జోగి రమేష్ నివాసంలో ఆయనను సిట్ బృందం అరెస్ట్ చేసింది. ఆయన ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ములకలచెరువు వద్ద బయటపడిన నకిలీ మద్యం తయారీ కేసు మూలాలను సిట్ బృందం గుర్తించింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావును ఇది వరకే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం మేరకు పోలీసులు జోగి రమేష్‌ను అరెస్ట్ చేసింది. రూ.3 కోట్ల మేరకు తనకు సాయం చేస్తానని రమేష్ హామీ ఇచ్చినట్లు జనార్ధనరావు చెప్పినట్లు తెలుస్తోంది. ములకలచెరువులో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డికి చెందిన మద్యం డంప్‌ను పోలీసులు ఛేదించిన విషయం తెలిసింది. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు…నకిలీ మద్యం తయారీ ముఠా వెనుక ఉన్న కీలక నేతలు ఎన్టీఆర్ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. జోగి మంత్రిగా ఉన్న సమయంలో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీకి కుట్ర జరిగినట్లు పోలీసులు గుర్తించారు. జనార్ధనరావు, జోగి రమేష్ మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించి పోలీసులు వద్ద పక్కా సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ సిట్ బృందం జోగి రమేష్‌ను అరెస్ట్ చేసింది.
Related Articles
ఊహించని షాకిచ్చిన చిరు ఉద్యోగులు..
- January 9, 2022
ఫిట్మెంట్ 23.29 శాతం
- January 7, 2022
