బద్రీనాథ్‌లోనూ బీజేపీకి…

తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పలేదు. ముఖ్యంగా మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో కూడా ఓటర్లు బీజేపీకి పక్కన పెట్టడం విశేషం. ఇటీవల 7 రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో బీజేపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. పది సీట్లను ఇండయా కూటమి దక్కించుకుంది. ఒకచోట ఇండిపెండెంట్‌ గెలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీకి ఘోరంగా ఓడిపోగా తాజాగా బద్రీనాథ్‌ కూడా ఓటర్లు బీజేపీని గెలిపించలేదు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో బద్రీనాథ్ ఒకటి కాగా, మంగళౌర్ రెండోది. బద్రీనాథ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజేంద్ర సింగ్ భండారీ బీజేపీలో చేరారు. ఇతర పార్టీల్లో గెలిపొందిన ఎవరైనా సరే.. కమలదళంలో చేరాలంటే రాజీనామా చేసి రావాలనే నియమం బీజేపీలో ఉంది. లేదంటే రాజ్యాంగబద్ధంగా శాసనసభాపక్షాన్ని విలీనమైనా చేయాలి. ఇదే పద్ధతిని ఉత్తరాఖండ్‌లో పాటించింది. క్రమంలో రాజేంద్ర సింగ్ భండారీ రాజీనామా చేయడంతో ఈ స్థానంలో ఉప ఎన్నికలు నిర్వహించారు. రాజీనామా చేసి వచ్చి తమ పార్టీలో చేరిన భండారీకే ఉప ఎన్నికలో బీజేపీ టికెట్ ఇచ్చింది. అయినా సరే ఆయన ఓటమిపాలయ్యారు. ఇక్కడి ఓటర్లు పార్టీ ఫిరాయింపును తిరస్కరించడంతో పాటు బీజేపీకి కూడా మరోసారి నో చెప్పారు.

Related Articles