హృతిక్‌ రోషన్‌ శ్రీరామచంద్రుడి పాత్రలో…?

ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ రామాయణ గాథను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీరామచంద్రుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్ హృతిక్‌ రోషన్‌ నటించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ ఎంత వరకు నిజం? అన్న విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. రామాయణాన్ని త్రీడీ రూపంలో తెరకెక్కించాలని చిత్రబృందం నిర్ణయించింది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు, సినిమా చిత్రీకరణ ప్రారంభోత్సవ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.