చైనాకు చెందిన షామీకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షామీ సరికొత్త ఫీచర్లతో తక్కువ కాలంలోనే ఓ సరికొత్త రికార్డును సృష్టించింది. భారత్లో ఇప్పటివరకూ 100 మిలియన్ల స్మార్ట్ఫోన్లను విక్రయించినట్లు తెలిపింది. అంతేకాదు, వరుసగా ఎనిమిది త్రైమాసికాల్లో అత్యధిక స్మార్ట్ఫోన్లు విక్రయించిన సంస్థల జాబితాలో షామీ అగ్ర స్థానంలో కొనసాగుతోంది అని షామీ ఇండియా ఉపాధ్యక్షుడు మనుకుమార్ జైన్ తెలిపారు.
ఆన్లైన్, ఆఫ్లైన్ అమ్మకాలు కలిపి ఈ రికార్డును నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ మార్కెట్లో 46+ శాతం, ఆఫ్లైన్లో 28+ శాతం వాటాతో షామీ ఇతర బ్రాండ్లకు దీటుగా ఉందని ఐడీసీ జూన్ 2019 గణాంకాల ద్వారా వెల్లడైంది.