తమ కంపెనీ వెల్లడించిన ఫలితాలను ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని గట్టిగా సమర్థించారు. ‘మా దగ్గర పటిష్టమైన పద్ధతి ఉంది. దేవుడు కూడా నంబర్లను మార్చలేడు. ఆరోపణలతో మా ఫైనాన్స్ టీమ్ అవమానించారని భావిస్తున్నార’ని ఆయన అన్నారు. అనలిస్టుల మీట్లో ఆయన మాట్లాడుతూ… కంపెనీపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.