ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య విచారణ కమిషన్‌

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ఆదేశించారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూర్‌కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్‌ను ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌లో వీఎన్ రేఖ, సీబీఐ మాజీ అధికారి కార్తికేయన్ ఉంటారు. విచారణకు ఆరు నెలలు గడువు ఇచ్చింది. ఈ కమిషన్ కేవలం ఎన్‌కౌంటర్‌పైనే విచారణ చేపట్టనుంది. హైదరాబాద్‌ కేంద్రంగా ఈ కమిషన్‌ విచారణ చేస్తుంది.దిశ ఎన్‌కౌంటర్‌పై ఇతర కోర్టులలో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు స్టే విధించింది. త్రిసభ్య కమిషన్ ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.

తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదించిన మాజీ అడ్వకేట్ జనరల్ ముకుల్ రోహత్గి కమిషన్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే చీఫ్‌ జస్టిస్‌ మాత్రం విచారణకు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసిందని తాము చెప్పడం లేదని,అయితే దర్యాప్తులో లభిస్తున్న ప్రతి అంశం మీడియాకు ఎలా వెళ్ళిందని ప్రశ్నిస్తూ… విచారణకు కమిషన్‌ వేస్తున్నామని, ఈ కేసుకులో సోషల్‌ మీడియాను కూడా కట్టడి చేయాలని ఆయన ఆదేశించారు.