అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు.ఈ సినిమా ద్వారా కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌తో మాట్లాడుతూ వర్మపై ఆయన ఇంకా తీవ్రమైన కామెంట్లు చేశారు. లంచాలు ఇచ్చి వర్మ సినిమాను ఆపడానికి ప్రయత్నించామని తనపై ఆరోపణలు చేస్తున్నారని, వర్మకు తగిన శాస్తి జరుగుతుందని ఆయన శాపనార్థాలు పెట్టారు.
‘ప్రజల్లో శాంతిని ప్రచారం చేస్తున్న నన్ను అవమానపరిచాడు. అంతేకాదు యేసు ప్రభువును కూడా అవమానించాడు. చివరకు ఏమైంది.. మూవీ ఫ్లాప్ అయ్యింది. ఆయనలో గర్వం తగ్గింది. ముఖం చూపించుకోలేకపోయాడు. ఇంకా చైనా నుంచి వచ్చాడో లేదో తెలియదు. నేపాల్ వెళ్లి చైనా అంటున్నాడేమో. ఆయన నోరు విప్పితే అబద్ధాలే. పవన్ కల్యాణ్ తెలియదని ఓ చానెల్లో అన్నాడు. చంద్రబాబులా ఉన్నాడా.. మీ కొడుకులా ఉన్నాడా అంటూ ఎదురు ప్రశ్నించాడు. ఎవరిని ఫూల్ చేయాలనుకుంటున్నాడు? ఇలాంటి చీప్ పబ్లిసిటీ మానుకొని.. దేవుడికి, నాకు, ప్రజలకు క్షమాపణ కోరితే.. మళ్లీ సినిమాల్లో విజయం పొందొచ్చని, లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడ’ని కేఏ పాల్ అన్నారు. వర్మను ఆయనకుటుంబం, ప్రజలు వెలివేశారని, ముంబై వెళితే అక్కడ సినిమాలు లేవ్నారు.
‘ఎక్కడా సినిమాలే్లే….. ఎవరో డబ్బులు ఇస్తే.. ఈ సినిమా చేశాడు. ఇలాంటి సినిమాలు ఆపేయడం మంచిది. మూవీ విషయంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు’ తెలిపార కేఏ పాల్.