ప్రస్తుతం పార్లమెంటులో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (సెకండ్ అమెండ్‌మెంట్) బిల్ 2019 ద్వారా కొత్త నిబంధన తీసుకు వచ్చారు. దీని ప్రకారం రియల్ ఎస్టేట్ కంపెనీ (బిల్డర్)పై దివాళ పిటీషన్ వేయాలంటే కనీసం వంద మంది ఇంటి కొనుగోలుదారులు లేదా మొత్తం కొనుగోలుదారుల్లో కనీసం పది శాతం మంది సంతకాలు చేయాల్సి ఉంటుంది. పైగా అదే రియల్ ఎస్టేట్ వెంచర్‌లో వీరు సభ్యులుగా ఉండాలి. గత గురువారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. అలాగే దివాలా తీసిన పాత బిల్డర్ కంపెనీ ఇంటి కొనుగోలుదారులపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా రక్షణ కూడా కల్పించేలా నిబంధనలను కొత్త బిల్లులో ఏర్పాటు చేశారు. అలాగే తనను మోసం చేసిన ఇతర కంపెనీలపై దివాలా తీసిన బిల్డర్ కేసు పెట్టవచ్చనే నిబంధనను కూడా ప్రభుత్వం చేర్చింది.