స్మార్ట్ ఫోన్ ఎగుమతులకు సంబంధించి మోడీ ప్రభుత్వంలోని రెండు శాఖల మధ్య యుద్ధం జరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ ఎగుమతులపై ఇంకా రాయితీల కోసం ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ (ఈ అండ్ ఐటీ) శాఖ ప్రయత్నాలు చేస్తుంటే… ఇపుడున్న రాయితీలకు ఆర్థిక శాఖ ఎసరు పెట్టింది. దీంతో ఈ అండ్ ఐటీ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్మార్ట్‌ఫోన్ ఎగుమతులపై ఇపుడు ఇ
ఇస్తున్న 4 శాతం ప్రోత్సాహక రాయితీని ఎత్తివేస్తే… ఎగుమతులు కుప్పకూలుతాయని, భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోతాయని హెచ్చరించింది. స్మార్ట్ ఫోన్స్ ఎగుమతిపై ఇపుడు 4 శాతం ప్రోత్సాహక రాయితీ ఇస్తున్నారు. దీన్ని ఆర్థిక శాఖ రద్దు చేసింది. జనవరి 1 నుంచి ఈ రాయితీని బంద్ చేసింది. దీంతో యాపిల్, వివో, ఒపో, ఫాక్స్‌కాన్, ఫ్లెక్స్‌ట్రాన్ కంపెనీల ప్రతినిధులు సంబంధిత శాఖ మంత్రులతో భేటీ అయ్యారు. ఆర్థిక శాఖ నిర్ణయంతో తాము చాలా ఇబ్బంది పడుతామని పేర్కొన్నారు. వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను కూడా వీరు కలిశారు. ఆర్థిక శాఖ నిర్ణయంపై ఈ అండ్ ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.