సాయిధరమ్ సిక్స్ ప్యాక్!

అల్లు అర్జున్, రామ్‌చరణ్, నితిన్, జూనియర్ ఎన్టీయార్, ప్రభాస్, రానా తదితర హీరోలందరూ ఇప్పటికే సిక్స్ ప్యాక్‌తో కనిపించారు. ఫ్యామిలీ హీరోగా ఇప్పటి వరకు కన్పించిన హీరో సాయిధరమ్ కూడా సిక్స్‌ ప్యాక్‌లో కన్పించనున్నారు. మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. తొలిసారిగా ఈ సినిమాకు సంబంధించి సిక్స్‌ ప్యాక్‌లో ఉన్న సాయి ధరమ్‌ తేజ్‌ స్టిల్స్‌ను విడుదల చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌ల సమయంలో సాయిధరమ్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారని తెలుస్తోంది. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల రాబోతోంది.

Related Articles