ఇప్పటికే భారత్‌లో రూ. 2,000 కోట్ల పెట్టుబడి పెట్టామని, మున్ముందు మరో రూ.3,000 కోట్ల పెట్టుబడి పెడుతామని ఎంజీ (మోరిస్ గ్యారెజస్) కంపెనీ పేర్కొంది. బ్రిటన్‌కు చెందిన ఈ కంపెనీని చైనాకు చెందిన ఎస్‌ఏఐసీ కొనుగోలు చేసింది. గుజరాత్‌లోని హలోల్‌లో కంపెనీ ఏర్పాటు చేసిన యూనిట్‌లో ఉత్పత్తి పూర్తి స్థాయిలో సాగుతోందని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది జులైలో భారత్‌లో తమ ప్రయాణం ప్రారంభమైందని, దీర్ఘాకలిక వ్యూహంతో భారత్‌లో పెట్టబడి పెడుతున్నట్లు కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా తెలిపారు. ఇంటర్‌నెట్ ఎస్‌యూవీ వాహనం ఎంజీ హెక్టార్‌కు మంచి ఆదరణ లభిస్తోందని… ఇప్పటికి 13,000 కార్లను అమ్మినట్లు కంపెనీ వెల్లడించింది. ఎలక్ట్రిక్ ఇంటర్‌నెట్ ఎస్‌యూవీతోపాటు 2021లో మరో నాలుగు మోడల్స్‌ను భారత మార్కెట్‌లోకి తెస్తామని ఆయన చెప్పారు.