హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ దూకుడు

తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్‌ దూకుడు పెంచింది. దేశమంతటా ఆర్థిక మాంద్యం దెబ్బతో రియల్‌ ఎస్టేట్‌ డీలా పడగా, హైదరాబాద్‌లో మాత్రం దూసుకుపోతోంది. 2019లో 16,801 నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ అనుమతి ఇచ్చింది. తద్వారా సమకూరిన ఆదాయం రూ. 987 కోట్లు.ఇందులో 14,600 అనుమతులు గృహ నిర్మాణాలకు ఇచ్చినవి కాగా, 2500 బహుళ అంతస్థుల నిర్మాణాకి ఉద్దేశించినవి. వీటిల్లో చాలా భాగం నగరంలోని వెస్ట్‌ జోన్‌ పరిధిలోనే ఇచ్చారు.ఐటీ కారిడార్లోని గచ్చిబౌలి, చందానగర్‌,గోపన్‌పల్లి, షేక్‌పేట, నల్లగండ్ల,కొండాపూర్‌, కొత్తగూడ, శేరిలింగం పల్లి తదితర ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు వస్తున్నాయి. గోపన్‌పల్లిలో ఓ నిర్మాణ సంస్థ 30 అంతస్తులు, ఆరు బ్లాకులతో 1,276ఫాట్ల నిర్మాణానికి అనుమతి తీసుకుంది. ఈ ఏడాదికి ఇదే అతి పెద్ద గృహ వినియోగ నిర్మాణమని చెబుతున్నారు. ఇండిపెండెంట్‌ రెడెన్షియల్‌ ఇళ్ళకు అనుమతి పొందిన ప్రాంతాల్లో హయత్‌ నగర్‌ ముందుంది. అత్యధికంగా ఇక్కడ 2380 నిర్మాణాలకు అమనుతి ఇచ్చారు.