జార్ఖాండ్ రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ ఆదివారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. రాంచీలోని మోరాబది గ్రౌండ్స్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో సోరెన్‌తో గవర్నర్ ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. సోరెన్‌తో పాటు సీఎల్‌పీ నేత అలంగీర్ అలం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రామేశ్వర్ ఒరాన్, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘెల్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆప్ పార్లమెంటు సభ్యుడు సంజయ్ సింగ్, జార్ఖాండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.