2020లో ఢిల్లీ రియల్‌ ఎస్టేట్‌…

ఆర్థిక మాంద్యం ప్రభావం ఈ ఏడాది కూడా రియల్‌ ఎస్టేట్‌ను ముప్పతప్పిలు పెట్టనుంది. దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాదిలో దీని ప్రభావం అధికంగా ఉంది. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ (నేషనల్‌ క్యాపిటల్ రిజియన్‌)లో కూడా ఈ ఏడాది రియల్‌ ఎస్టేట్‌ ధరల్లో పెద్దగా మార్పులు ఉండవని స్థానిక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అంటున్నట్లు పలు కన్సల్టెన్సీ సంస్థలు చెబుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, అనధికారిక కాలనీలకు గుర్తింపు… వంటి అంశాల వల్ల రెసిడెన్షియల్‌ మార్కెట్‌కు కాస్త ఊపు వచ్చినా… రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు తమ వద్ద ఖాళీగా పడిఉన్న ఫ్లాట్లు అమ్మడానికి ప్రయత్నించే అవకాశలు ఉన్నాయి. వ్యాపరస్థులు కూడా ధరలు పెంచకుండా… టర్నోవర్‌ పెంచే అంశంపైనే దృష్టి పెడుతున్నారు. దీంతో పరిశ్రమలో కాస్త కదలిక వస్తుందని వీరు భావిస్తున్నారు. 2018తో పోలిస్తే 2019లో ఢిల్లీ మార్కెట్‌లో రియల్‌ ఎస్టేట్ ఆస్తుల ధరలు కేవలం 2 శాతం మాత్రమే పెరిగాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే… ధరలు తగ్గినట్లే లెక్క. కొత్త ప్రాజెక్టుల సంఖ్య కూడా 2019లో 18 శాతం తగ్గాయి. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులందరీ దృష్టి… తమ వద్ద ఉన్న ఇన్వెంటరీని తొలగించుకోవడమే. కాబట్టి డిమాండ్‌ పెరిగినా… ధరలు పెరిగే అవకాశాలు చాలా తక్కువగా కన్పిస్తున్నాయి.