అఖిల్ మూవీ సాంగ్‌ ఇదిగో…

అఖిల్‌ అక్కినేని, పూజా హేగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్‌ తీస్తున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ మూవీలో ‘గుచ్చే గులాబీ’ లిరికిల్‌ పాట వీడియో విడుదలైంది. అనంత శ్రీరామ్‌, శ్రీమణి రాసిన ఈ పాటను ఆర్మాన్‌ మాలిక్‌ పాడారు. గోపి సుందర్‌ మ్యూజిక్‌ అందించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీతగోవిందం, ప్రతిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్టర్స్ తో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా క్రేజ్‌ని సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ ద‌ర్శకుడు వాసు వర్మ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌‌‌‌లర్ సినిమా అనౌన్స్‌ చేసిన దగ్గర నుంచి అక్కినేని అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చాలా గ్యాప్‌తో వస్తున్న అఖిల్‌ మూవీ ఇది. ‘మనసా మ‌న‌సా’ పాటకు, ఆ త‌రువాత విడుదల చేసిన టీజ‌ర్ కు అటు సోషల్ మీడియా లో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్ లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. ఇదే ఉత్సాహంతో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ యూనిట్ తాజా గుచ్చు గులాబీ పాటను విడుదల చేశారు. ఈ సినిమాను వేసవిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు.