మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లను శ్రీశైలం దేవస్థానం అధికారులు ప్రారంభించారు. మార్చి 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అంటే 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈసారి కోవిడ్ నిబంధనల మేరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు తెలిపారు. ఈ సారి ఉత్సవాల్లో స్పర్శ దర్శనం ఉండదని, అలాగే పాతాళ గంగలో స్నానాలు ఉండవని స్పష్టం చేశారు. ఇవి తప్ప మహాశివరాత్రి ఉత్సవాలు ఎప్పటిలాగే యధాతథంగా జరుగుతాయని ఆయన తెలిపారు. వెంకటాపురం, నాగలూటి, పెచ్చెర్వు, భీమునికొలను, కైలాసద్వారం మీదుగా కాలినడకన శ్రీశైలంకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లును చేసినట్లు ఆయన చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెఎస్ రామారావు నిన్న స్వయంగా పెచ్చెర్వు అటవీ మార్గాన్ని సందర్శించి… ఏర్పాట్లును చూశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.