‘పద్మా’లను వెతకండి

పద్మా అవార్డులకు అర్హులను వెతికేందుకు ఒక ప్రత్యేక సెర్చ్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రలను కేంద్ర ప్రభుత్వం కోరింది. మారుమూల ప్రాంతాల్లో సమాజానికి అద్భుత సేవ చేస్తున్నవారు ఉంటారని, వారిని వెతికేందుకు ఒక సెర్చ్‌ కమిటీని ఏర్పాటు పేర్కొంది. ఏటా రిపబ్లిక్‌ డే రోజున పద్మా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. 2022 ఏడాదికి ఈనెల 1వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించడం ప్రారంభించారు. సెప్టెంబర్‌ 15 వరకు నామినేషన్లను padmaawards.gov.inలో అప్‌లోడ్‌ చేయొచ్చు. పద్మా అవార్డు కోసం భారీ సంఖ్యలోదరఖాస్తులు వస్తున్నాయి. రాష్ట్రాలు కూడా పంపుతున్నాయి. అయితే ఈసారి ప్రత్యేక సెర్చ్‌ కమిటీల ద్వారా నామినేషన్లను పంపమని కేంద్రం కోరుతోంది.