మొన్నటిదాకా కరోనాను ఎదుర్కొనే విషయంలో రాజకీయాలు చేయరాదని, కేంద్రానికి సహకరించాలని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇపుడు వ్యాక్సిన్‌పై ఇతర రాష్ట్రాలకు లేఖ రాయడాన్ని బీజేపీ నేత, ఏపీ ఇంచార్జి సునీల్ దేవధర్ తప్పు పట్టారు. ఒకవైపు కేంద్రంతో సఖ్యంగా ఉంటూనే, ఇలాంటి లెటర్స్ రాయడం… కేంద్రాన్ని పరోక్షంగా బెదిరించే యత్నమేనని ఆయన అన్నారు. ఓ టీవీ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ… జార్ఖండ్ సీఎంకు లేఖ రాసిన జగన్ ఇపుడు వ్యాక్సిన్‌పై సీఎంలకు ఎలా లేఖ రాస్తారని ఆయన ప్రశ్నించారు. మోడీ చేతిలో జగన్ కీలు బొమ్మలా వ్యవహరిస్తున్నారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సునీల్ దేవధర్ సమాధానం ఇస్తూ… ఈ విషయంలో అలా అనలేమని.. ఎందుకంటే ఆయన లేఖ రాసింది బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకని దియోధర్ అన్నారు. జగన్ వైఖరి ఎలా ఉందంటే… చేయాల్సిన పాపాలన్ని చేసి.. కాశీకి వెళ్ళినట్లుందన్నారు.
@ysjagan is trying to become the new age “mausam vaigyanik “. From asking @HemantSorenJMM not to question centre to now trying to cosy up in the opposition club, Mr Reddy is doing politics “new age style “. “Conscience on Call. “ Full details on @IndiaAheadNews https://t.co/pAq3Dp5nOL
— bhupendra chaubey (@bhupendrachaube) June 4, 2021