సీఐడీ అడిషనల్ డీజీపీ సునీల్‌కుమార్‌కు నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు లీగల్ నోటీసులు ఇచ్చారు. తన అరెస్ట్ సమయంలో పోలీసులు తీసుకున్న ఐ-ఫోన్‌ను తిరిగి ఇవ్వాలంటూ ఆ నోటీసులో ఎంపీ కోరారు. స్వాధీనం చేసుకున్న ఐ-ఫోన్‌ను రికార్డుల్లో ఎక్కడా చూపలేదని, ఫోన్లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయని అన్నారు. అరెస్టు సమయంలో తన దగ్గర నుంచి తీసుకున్న వస్తువులను మెజిస్ట్రేట్ వద్ద జమ చేయాలని నోటీసు ఇచ్చారు. పార్లమెంట్ విధులను నిర్వర్తించడానికి ఫోన్ తిరిగి ఇవ్వాలని నోటీసులో తెలిపారు. ఫోన్ తిరిగి ఇవ్వని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు.