మార్చితో ముగిసిన మూడే నెలల్లో ఇండిగో విమానాలు నడిపే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ రూ. 1,147 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర నష్టం రూ. 870 కోట్లు. కంపెనీ టర్నోవర్ ఇదే మూడు నెలల్లో రూ.8,299 కోట్ల నుంచి రూ.6,222 కోట్లకు పడిపోయింది. కోవిడ్ కారణంగా కంపెనీ ఆదాయం బాగా దెబ్బతిందని ఇంటర్ గ్లోబ్ పేర్కొంది. పైగా ఇంధన ధరలు పెరగడంతో కూడా కంపెనీ పనితీరును దెబ్బతీశాయి. డిసెంబర్ 2020తో ముగిసిన త్రైమాసికంలో ఇంధన చార్జీలు రూ.1,142 కోట్లు మార్చితో ముగిసిన మూడు నెల్లో ఇంధన చార్జీలు 67 శాతం పెరిగి రూ.1,914కోట్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది.