13 ఏళ్ళ గరిష్ఠానికి ‘స్విస్‌ సొమ్ము’

విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం తెస్తానని హామి ఇచ్చిన మోడీ హయాంలో విదేశాల్లో నల్లధనం జెట్‌ స్పీడుతో పెరుగుతోంది. ముఖ్యంగా కరోనాతో మనదేశం విలవిల్లాడుతుంటే స్విస్ ఖాతాల్లో మన వాళ్ళ ధనం 300 శాతం పెరిగింది. స్విస్‌ ఖాతాల్లో భారతీయులు, భారత సంస్థలు దాచుకున్న మొత్తం 13 ఏళ్ళ గరిష్ఠానికి చేరిందని స్విట్జర్‌ల్యాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వెల్లడించింది. భారత కరెన్సీ ప్రకారం భారతీయు దాచుకున్న మొత్తం రూ. 20,700 కోట్లకు చేరిందని ఆ బ్యాంక్‌ వెల్లడించింది. షేర్లు, ఇతర సాధానాల రూపంలో ఈ నిధులను వీరు జమ చేసినట్లు పేర్కొంది. 2020లో అంటే కరోనా సమయంలో స్విస్‌ ఖాతాల్లో భారతీయుల సొమ్ము బాగా పెరిగిందని తెలిపింది. 2019 చివర్లో కేవలం రూ. 6,625 కోట్లు మాత్రమే ఉన్న ఈ మొత్తం… 2020లో రూ. 20,700 కోట్లకు చేరిందని స్విస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ తెలిపింది. 2006లో అత్యధికంగా 650 స్విస్‌ ఫ్రాంక్‌లు ఉన్న మనవాళ్ళ నిధులు 2011, 2013, 2017లలో మినహా.. మిగిలిన సంవత్సరాల్లో తగ్గుతూ వచ్చింది. గత ఏడాది మాత్రం భారీగా పెరిగింది.

Related Articles