కరోనా విలయం నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్న మహారాష్ట్ర థర్డ్ వేవ్‌కు సిద్ధమౌతోంది. రానున్న రెండు లేదా నాలుగు వారాల్లో అంటే నెలలోనే థర్ద్ వేవ్ రాష్ట్రాన్ని లేదా ముంబైను తాకుందని కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ హెచ్చరించింది. గత మూడు రోజుల్లో జనం గుంపులుగా గుమి గూడటాన్ని బట్టి టాస్క్ ఫోర్స్ ఈ అంచనాకు వచ్చింది. ఇప్పటి వరకు దిగువ మధ్య తరగతికి తాకినట్లు పిల్లలను తాకకపోవచ్చని టాస్క్ ఫోర్స్ అభిప్రాయపడింది.మూడో వేవ్‌కు సన్నద్ధం కావడానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో ఇవాళ జరిగిన సమావేశాలు ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రెండో వేవ్‌లో ఎంత మందికి కరోనా సోకిందో.. దానికి రెట్టింపు సంఖ్యలో మూడో వేవ్‌లో కరోనా సోకవచ్చని టాస్క్‌ఫోర్స్ అంచనా వేసింది. యాక్టివ్ కేసులు ఇపుడు 1.4 లక్షలు ఉండగా, ఇది 8 లక్షలకు చేరవచ్చని పేర్కొంది. తొలి వేవ్‌లో కరోనా 19 లక్షల మందికి సోకగా, రెండో వేవ్‌లో 40 లక్షల మందికి సోకింది. మూడో వేవ్ రెట్టింపు అంటే 80 లక్షలకు చేరొచ్చన్నమాట. అయితే వీరిలో పది శాతం కేసులు పిల్లలు, యవత ఉండొచ్చని అంచనా. తొలి, రెండో వేవ్‌లో కూడా ఇంతే మందికి సోకిందని టాస్క్ ఫోర్స్ పేర్కొంది.