కిమ్ శర్మతో టెన్నిస్ స్టార్ డేటింగ్..

సినీ న‌టి కిమ్ శ‌ర్మ‌.. టెన్నిస్ స్టార్ లియాండ‌ర్ పేస్‌.. ఇద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా దిగిన ఫోటోల‌ను  గోవాలోని ఓ రెస్టారెంట్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. కిమ్ శ‌ర్మ‌ను వెనుక నుంచి హ‌గ్ చేసిన ఓ ఫోటోను ఆ హోట‌ల్ త‌న అకౌంట్‌లో పోస్టు చేసింది. ఆ ఫోటో వైర‌ల్ కావ‌డంతో డేటింగ్ రూమ‌ర్స్ కూడా జోరందుకున్నాయి. ఇలా ఇద్దరు కలిసి గోవా బీచ్‌లో ఏంచక్కా చెట్టాపట్టాలేసుకుని విహరిస్తూ ఫోటోలకు పోజులిచ్చారు. వాళ్లిద్దరూ ఇలా కలిసి కెమెరాకు చిక్కడ ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు కెమెరాలకు చిక్కారు.