బెల్ బాటమ్ ట్రైలర్ విడుదల

అక్షయ్‌కుమార్‌ నటించిన బెట్‌ బాటమ్‌ మూవీ ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మూవీ హీరో అక్షయ్‌ కుమార్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. రంజిత్‌ ఎం తివారీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 19న విడుదల కానుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ తరవాత విడుదల అవుతున్న పెద్ద మూవీ ఇదే. 1984లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌ RAW ఏజెంట్‌గా నటించారు. వాణి కపూర్‌, హుమా ఖురేషి, లారా దత్తా కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ 3డీలో కూడా విడుదల కానుంది.h