“గాడ్​ ఫాదర్” గా చిరు

మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘లూసిఫర్’ చిత్రం రీమేక్‌లో చిరంజీవి నటిస్తున్నారు. ఈనెల 13 నుంచి హైదరాబాద్​లో చిత్రీకరణ మొదలు కానున్నట్లు సమాచారం. విభిన్నమైన పొలిటికల్​ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమా కోసం ‘గాడ్​ ఫాదర్​’ అనే టైటిల్​ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది . చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న చిత్ర టైటిల్​తో పాటు ఫస్ట్​లుక్​ను విడుదల చేసే అవకాశమున్నట్లు సమాచారం. మెగాస్టార్ నటిస్తున్న 153వ చిత్రమిది. దీనికి తమన్​ స్వరాలందిస్తున్నారు. మలయాళీ సూప్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన చిత్రమే ‘లూసీఫర్’.

Related Articles