జెర్సీ బరిలో నుంచి తప్పుకునే సరికి పుష్పాకు మంచి థియేటర్స్ దొరికాయి. ఇక రణవీర్ సింగ్ నటించిన 83 మూవీ కూడా క్రమంగా బలహీనపడుతోంది. దీంతో పుష్ప వారాంతాన మళ్లీ పుంజుకున్నాడు. శుక్రవారం రూ.3.50 కోట్లు కలెక్ట్ చేసి తగ్గేదే లేదు… అంటూ స్ట్రయిట్ హిందీ సినిమాలకు సవాల్ విసురుతున్నాడు. ఇప్పటికే సినిమా హిందీ వెర్షన్ కలెక్షన్స్ రూ. 50.59 కోట్లకు చేరాయి. ఇవాళ, రేపు కూడా పుష్ప మంచి కలెక్షన్స్ సాధిస్తుందని బాలీవుడ్ అంచనా.