Ashes: బెయిర్‌స్టో సెంచరీ

యాషెస్‌ సీరిస్‌లో మరో పరాభవం దిశగా అడుగులేస్తున్న ఇంగ్లాండ్ జట్టులో జానీ బెయిర్‌స్టో కొత్త ఉత్సాహన్ని నింపాడు. సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీ నమోదు చేశాడు. 103 బంతుల్లో 140 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. అతడికి బెన్‌ స్టోక్స్‌ (66) సహకరించడంతో మూడో రోజైన శుక్రవారం ఇంగ్లండ్‌ 70 ఓవర్లలో 7 వికెట్లకు 258 పరుగులు చేసింది. ఐదో వికెట్‌కు బెయిర్‌స్టో-స్టోక్స్‌ జోడీ 128 పరుగులు జత చేసింది. అలాగే ఈ యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ తరఫున జానీదే తొలి సెంచరీ. మార్క్‌ వుడ్‌ (39) చివర్లో రాణించాడు. ఆసీ్‌సకన్నా ఇంగ్లండ్‌ 158 పరుగులు వెనుకంజలో ఉంది. కమిన్స్‌, బోలాండ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ను 416/8 వద్ద డిక్లేర్‌ చేసింది.