సీనియర్ హీరో అర్జున్‌కు తన వల్ల ఇబ్బంది కలిగి ఉంటే సారీ చెబుతున్నానని నటుడు విశ్వక్సేన్ అన్నారు. సినిమా అంశంలో తాను కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని చెప్పానని… ‘నువ్వు వదిలేయ్. నన్ను నమ్ము అంటూ చెప్పనిచ్చేవారు కాదు. నన్ను కట్టిపడేసినట్లు అయింద’ని విశ్వక్ సేన్ అన్నారు. సినిమా నుండి వెళ్లిపోతానని మాత్రం తాను చెప్పలేదని అన్నారు షూటింగ్ ప్రారంభానికి ముందు తాను క్యాన్సిల్ చేయడం తప్పేనని… తన వల్ల ఇబ్బంది పడి ఉంటే క్షమించండని అర్జున్‌కు సారీ చెప్పారు. విశ్వక్ సేన్ వల్ల తనకు, తన టీమ్‌కు అవమానం జరిగిందని, తన వల్ల ఎన్నో సార్లు షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని సీనియర్ హీరో అర్జున్ ఆరోపించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడి… రేపు షెడ్యూల్ స్టార్ట్ అనగా అర్ధరాత్రి ఫోన్ చేసి షూటింగ్ కాన్సిల్ చేద్దామని విశ్వక్ సేన్ అన్నారని అర్జున్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో అర్జున్ చేసిన ఆరోపణలపై విశ్వక్ సేన్ రియాక్ట్ అయ్యారు.