సీబీఐ, ఈడీతో పాటు ఐటీ అధికారులు కూడా ఎన్‌డీఏ మిత్ర పక్షంగా వ్యవహరిస్తున్నాయని అంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఈ వీడియో రుజువు. మోడీ పాలనలో ఒక్కో విభాగం ఎలా హద్దులు మీరుతోందో ఈ వీడియోలో అధికారి ప్రవర్తన తెలుపోతోంది. దశాబ్దాలు భారత దేశంలో పనిచేస్తున్న బీబీసీ సంస్థపై ఇపుడే ఐటీ అధికారులకు ఎందుకు అనుమానం వచ్చిందో అందరికీ తెలిసిందే. ప్రతి ఏటా ఐటీ రిటర్న్‌లు, కంపెనీ వ్యవహారాల శాఖ సమాచారం అందిస్తోంది బీబీసీ. ఎపుడూ వీరికి అనుమానం రాలేదు. మోడీపై ప్రత్యేక కథనం రాసిన వెంటనే ఐటీ దాడులు బీబీసీ కార్యాలయంపై దండెత్తారు. ఇవి స్వేలు కావని, దాడులు అంతకన్నా కావని కేవలం సర్వే కోసం బీబీసీ ఆఫీసకు వచ్చినట్లు ఐటీ అధికారులు తెలిపారు. మరి సర్వే చేసేందుకు వచ్చిన ఓ ఐటీ అధికారు బీబీసీ అధికారులతో ప్రవర్తించిన తీరును మరో జర్నలిస్ట్ వీడియో చేసి పోస్ట్ చేశారు.