సాంకేతిక కారణాలతో మూడు రోజుల పాటు 33 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లింగంపల్లి నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి లింగంపల్లి, ఫలక్‌నుమా లింగంపల్లి, లింగంపల్లి ఫలక్‌నుమా, సికింద్రాబాద్ లింగంపల్లి, లింగంపల్లి సికింద్రాబాద్, రామచంద్రాపురం ఫలక్‌నుమా, ఫలక్‌నుమా రామచంద్రాపురం, ఫలక్‌నుమా హైదరాబాద్ సర్వీసులను సోమ, మంగళ, బుధవారాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.