హనుమకొండలో టెన్షన్‌.. టెన్షన్‌

హన్మకొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది. యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌పై బీఆర్ఎస్ నేతలు దాడి చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుండగా.. దాడి చేశారు. పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలు పవన్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా.. ఈ దాడి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పవన్.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తీవ్రగాయాలతో పడి ఉన్న పవన్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడింది ఎమ్మెల్యే అనుచరులేనని ఆరోపిస్తూ… కాంగ్రెస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఆసుపత్రి వద్దకు భారీగా చేరిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఆందోళనలతో అర్థరాత్రి వరకు ఉద్రిక్తత కొనసాగింది. వైద్యుల చికిత్స అనంతరం కాసేపటికి.. పవన్ స్పహలోకి వచ్చారు. పవన్‌ను డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అద్యక్షులు బల్మూరి వెంకట్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి పరామర్శించారు.

Related Articles