తిరుమలలో అక్రమాల నివారణకు మార్చి 1 నుంచి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టీటీడీ అందుబాటులోకి తేనుంది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రిఫండ్ చెల్లింపు తదితర అం శాల్లో మరింత పారదర్శకతను పెంచేందుకు వీలుగా దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నది. సర్వదర్శనం కాంప్లెక్స్‌లో ఒకే వ్యక్తి అధిక లడ్డూ టోకెన్లు పొందకుండా, గదుల కేటాయింపు కేం ద్రాలు, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ఈ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకురానున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.