ప్రముఖ తమిళ నటుడు ప్రభు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే చెన్నైలోని కొడంబక్కంలోని మెడ్వే ఆసుపత్రికి తరలించారు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీలోకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ తరుణంలోనే మంగళవారం రాత్రి తీవ్రంగా అనారోగ్యం పాలవ్వడంతో ఆయన్ని హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రభు కిడ్నిలో రాళ్లు ఉండగా.. యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలోని రాళ్లను తొలగించినట్లు వైద్యులు తెలిపారు.