జోమాటో నుంచి ఇంటి భోజనం

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సరికొత్త సర్వీసుల్ని ప్రారంభించింది. జొమాటో ఎవ్రీడే సర్వీస్ పేరుతో.. ఇంటి తరహా భోజనం అందించే లక్ష్యంతోనే ఈ సర్వీసుల్ని ప్రారంభించిందీ ఫుడ్ డెలివరీ యాప్. సరసమైన ధరలకే ఇది అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ఇక రియల్ హోమ్ షెఫ్స్‌తోనే ఈ ఫుడ్ తయారుచేస్తామని వెల్లడించింది. తన బ్లాగ్ పోస్ట్‌లో జొమాటో ఈ వివరాలను వెల్లడించింది. కుటుంబాలకు దూరంగా ఉంటూ.. ఇంటి భోజనాన్ని మిస్సయ్యే వారి కోసం ఈ సర్వీసులు ప్రారంభించినట్లు.. వారు ఇక తమ ఇంట్లో తిన్నట్లే ఈ భోజనం ఉంటుందని తెలిపింది. ప్రస్తుతానికి గురుగ్రామ్‌‌లోనే ఈ సర్వీసులు ప్రారంభం కాగా.. త్వరలో ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నట్లు వెల్లడించింది.