సన్‌రైజర్స్ కెప్టెన్‌గా మార్‌క్రమ్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ ఐడెన్‌ మార్‌క్రమ్‌ నియమితుడయ్యాడు. గత సీజన్‌లో హైదరాబాద్‌కు కేన్‌ విలియమ్సన్‌ సారథ్యం వహించాడు. అయితే, పేలవ ప్రదర్శన నేపథ్యంలో అతడిని సన్‌రైజర్స్‌ వదులుకొంది. సౌతాఫ్రికా లీగ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ తరఫున మార్‌క్రమ్‌ అద్భుతంగా రాణించాడు. దీంతో ఐపీఎల్‌ 2023 సీజన్‌కు కెప్టెన్సీ రేస్‌లో మార్‌క్రమ్‌ ముందు వరుసలో నిలిచాడు. వచ్చే నెల 31న ఐపీఎల్‌ ఆరంభం కానుంది.