పడవ బోల్తా.. ఆరుగురు యువకులు గల్లంతు

నెల్లూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వాళ్ల కోసం పోలీసులు, ఫైర్‌ సిబ్బంది గాలిస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో సరదాగా షికారుకు వెళ్లినట్లు చెబుతున్నారు. మొత్తం పదిమంది పడవలో చెరువులోకి వెళ్లగా.. నలుగురు క్షేమంగా బయటపడ్డారు.. ఆరుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకులు.. ప్రశాంత్(29), కళ్యాణ్(28), రఘు (24), బాలాజీ (21), సురేంద్ర(19), త్రినాథ్ (18)గా గుర్తించారు. చెరువు మధ్యలోకి వెళ్లిన తర్వాత పడవలోకి నీరు రావడంతో కొంతమంది బయపడి బోటులో నుంచి దూకగా.. వారిలో నలుగురు ఈత కొట్టుకుంటూ సురక్షతంగా ఒడ్డుకు చేరుకోగా.. ఆరుగురు గల్లంతయ్యారు. తోడేరు చెరువులో బోటు ప్రమాద సంఘటనపై మంత్రి కాకాణి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి తెలియగానే కేరళ వ్యవసాయ సదస్సు నుంచి హుటాహుటిన బయలుదేరారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ముమ్మురం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.