నటుడు మంచు మనోజ్ ఇవాళ రాత్రి 8.30 గంటలకు భూమా మౌనికా రెడ్డిని వివాహం చేసుకోనున్నారు. మౌనికా రెడ్డి ఫోటోను ట్వీట్ చేస్తూ మంచు మనోజ్ ఈ విషయం వెల్లడించారు. మనోజ్‌కు 2015లోనే ప్రణతీరెడ్డితో వివాహమైంది. అయితే 2019లో వీరిద్దరూ విడిపోయారు. తన స్నేహితురాలు భూమా మౌనికా రెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోనున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిని నిజం చేస్తూ మనోజ్ ఇవాళ ట్వీట్ చేశారు.