జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణం ఇక మరింత భారం కానుంది. వాహనదారుల ‘టోల్’ తీసేందుకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) సిద్ధమవుతోంది. జాతీయ రహదారుల రుసుము నిబంధనలు 2008 ప్రకారం టోల్ ట్యాక్స్‌ను ఏటా సవరిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఈ సారి 5-10 శాతం పెంచేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కార్లు, తేలికపాటి వాహనాలకు 5, భారీ వాహనాలకు 10 టోల్ రుసుమును పెంచనున్నారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రె్‌సవేలపై కిలోమీటరుకు రూ.2.19 చొప్పున టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. కాగా, టోల్‌ప్లాజాలకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించేవారికి ఇస్తున్న నెలవారీ పాస్ ధరను కూడా 10కి పెంచనున్నట్లు తెలుస్తోంది.