ఇమ్రాన్ ఖాన్‌పై టీవీ చానళ్లలో నిషేధం

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగాలను టీవీ చానళ్లలో ప్రసారం చేయొద్దంటూ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆయన ప్రసంగాలు దేశంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించేలా ఉన్నాయని ఆదేశాల్లో పేర్కొంది. ప్రజల ప్రశాంత జీవనానికి అవి భంగం కలిగించే అవకాశం ఉందని తెలిపింది. ఆయన నిర్వహించే విలేకరుల సమావేశాలు, చేసే ప్రసంగాలు, పాత వీడియోలనూ ప్రసారం చేయొద్దని శాటిలైట్‌ చానల్స్‌ను ఆదేశించింది. ఉల్లంఘించే టీవీ చానళ్ల లైసెన్సులను సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించింది. అయినప్పటికీ సోమవారం ఉదయం ఓ ప్రైవేటు టీవీ చానల్‌ ‘ఏఆర్‌వై టీవీ’లో ఆదివారం నాటి ఇమ్రాన్‌ ప్రసంగాన్ని ప్రసారం చేశారు.