అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. స్వామి వారి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. సుమారు 6 నిమిషాల పాటు లేలేత కిరణాలు స్వామివారిని తాకాయి. స్వామి వారి పాదాల నుంచి శిరస్సు వరకూ సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ అపురూప ఘట్టాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఏటా ఉత్తరాయణం మార్చి 9, 10 తేదీలలో, దక్షిణాయణం అక్టోబర్ 1, 2, 3 తేదీలలో స్వామివారిని సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోంది.