మొబైల్స్‌లో… ఉచిత సేవలు బంద్‌?

టెలికాం రంగం మనుగడే ప్రశ్నార్థకంగా మారడంతో… ఈ రంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. కార్యదర్శుల కమిటీ దీనికి సంబంధించి ఓ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వాయిస్‌తో పాటు డేటాను కూడా ఉచితంగా ఇచ్చే పద్ధతికి టెలికాం కంపెనీలు స్వస్తి పలకాలని ఈ కమిటీ భావిస్తోంది. దీనికి గాను వాయిస్‌, డేటా కోసం కనీస చార్జీని టెలికాం విభాగం నిర్ణయించనుంది. అంటే కంపెనీలు ఇంతకన్నా తక్కువ మొత్తానికి డేటా లేదా వాయిస్‌ సర్వీసులను ఇవ్వడాన్ని నిషేధిస్తారు. దీనికి సంబంధించిన విధివిధానాలను కార్యదర్శుల కమిటీ పరిశీలిస్తోందని సీఎన్‌బీసీ టీవీ 18 స్పష్టం చేసింది.
1 నుంచి చార్జీల మోత
ఐడియో వొడాఫోన్‌ ప్రకటించాయి. తొలుత చార్జీలను పెంచుతున్నట్లు ఐడియా ప్రకటించింది. టెలికాం రంగం మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుండటంతో ట్రాయ్‌ సంప్రదింపులు ప్రారంభించింది. దీంతో టెలికాం రంగంలో కీలక మార్పులు వస్తాయని స్టాక్‌ మార్కెట్‌ భావిస్తోంది. దీంతో ఎయిర్‌టెల్‌, ఐడియా వొడోఫోన్‌ షేర్లు భారీ లాభాలతో ముగిశాయి.