స్పోర్ట్స్‌ అకాడమీ ప్రారంభించిన గుత్తా జ్వాల


ఇండియా బ్యాడ్మింటన్‌‌ డబుల్స్‌‌ ప్లేయర్‌‌ జ్వాల గుత్తా.. ‘అకాడమీ ఆఫ్‌‌ ఎక్సలెన్స్‌‌’ పేరుతో అకాడమీని ప్రారంభించారు. గచ్చిబౌలిలోని ఓ స్కూల్‌‌లో ఏర్పాటు చేసిన ఈ అకాడమీ వచ్చే నెల నుంచి మొదలవుతుంది. అంతర్జాతీయ ప్రమాణాకుల అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో శిక్షణ ఉంటుందని గుత్తా జ్వాల వెల్లడించారు. క్రికెట్‌‌, బ్యాడ్మింటన్‌‌, స్విమ్మింగ్‌‌తో పాటు ఇతర క్రీడాంశాల్లోనూ శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం 55 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ అకాడమీలో 14 కోర్టులు నిర్మిస్తున్నారు. 600 మంది కూర్చుకునే వీలు ఉంటుంది. ఇద్దరు విదేశీ, పది మంది స్వదేశీ కోచ్‌‌లు పని చేయనున్నారు. ఈ అకాడమీకి సాయం చేయాలని క్రీడా మంత్రిత్వ శాఖను సంప్రదించానని జ్వాల చెప్పింది. కోచ్‌‌ల కోసం ఆరు నెలల డిప్లమా కోర్సును ప్రవేశ పెడుతున్నామన్నారు. తనకు కోచింగ్‌‌లో అనుభవం లేనందున కేవలం మెంటార్‌‌గా వ్యవహరిస్తానని గుత్తా జ్వాల అన్నారు.