ముషారఫ్‌కు మరణశిక్ష

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. రాజద్రోహం కేసులో ఆయనను దోషిగా తేల్చిన పెషావర్ ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పు చెప్పింది. పెషావర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. దేశాధ్యక్షునికి మరణశిక్ష విధించడం పాక్‌ చరిత్రలో ఇదే మొదటిసారి.ప్రస్తుతం దుబాయ్‌లో తలదాచు కుంటున్నారు. అరుదైన వ్యాధికి చికిత్స చేయించుకుంటున్నారు.

2013లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) ప్రభుత్వం ముషారఫ్‌పై రాజద్రోహం కేసు నమోదు చేసింది. 2007లో రాజ్యాంగాన్ని కూలదోసి ఎమర్జెన్సీ పాలన విధించడంతో ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో అనేక మంది న్యాయమూర్తులను గృహ నిర్బంధంలో ఉంచారు. మీడియాపై ఆంక్షలు విధించారు.

Related Articles