ఫాల్కే అవార్డు అందుకున్న అమితాబ్‌

బాలివుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ తనకు ఇంతటి గౌరవం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వాస్తవానికి జాతీయ సినీ అవార్డుల సమయంలోనే ఈ అవార్డును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ద్వారా అమితాబ్‌ అందుకోవాల్సింది. అయితే అనారోగ్యం కారణంగా ఆయన ఆ కార్యక్రమానికి రాలేదు. దీంతో ఇవాళ ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు అందజేశారు.