మెడికల్ కోర్సల్లో చేరేందుకు అర్హత పరీక్ష అయిన నీట్ 2020 దరఖాస్తుకు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సి (ఎన్‌టీఏ) పెంచింది. జనవరి 6వ తేదీ రాత్రి 11.30 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 15 నుంచి జనవరి 31వ తేదీలోపల దరఖాస్తుల్లో మార్పులకు అనుమతిస్తారు. మే 3వ తేదీన 11 భాషల్లో నీట్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది నుంచి జిప్‌మర్, ఎయిమ్స్ సంస్థలకు విద్యార్థుల ఎంపిక నీట్ ద్వారానే జరుగుతుంది.