UPSC డిఫెన్స్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల. 

డిఫెన్స్ సర్వీసెస్ II 2020 సంవత్సరానికి గాను పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలలో మొత్తం 344 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికషన్ విడుదల చేశారు.

మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరడానికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇండియన్ నావల్ అకాడమీలో దరఖాస్తు చేసుకోవడానికి ఇంజినీరింగ్ డిగ్రీ కనీస అర్హత. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో దరఖాస్తు చేసుకోవడానికి 12వ తరగతి అర్హత సరిపోతుంది. అన్ని ఉద్యోగాలకు వయసు పరిమితి 20 నుంచి 24 సంవత్సరాలు.
అభ్యర్థులు upsc.gov.in, upsconline.nic.in. వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లకేషన్ చివరి తేది ఆగస్టు 25.

Related Articles