వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కరోనా తరవాత విడుదలైన సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధిచిన చిత్రంగా ఇండస్ట్రీ చెబుతోంది. విడుదలైన అన్ని థియేటర్లు హౌస్ కలెక్షన్స్‌తో నడుస్తోంది. చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.42 కోట్ల షేర్ వసూలు చేయగా, ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 9.3 కోట్లు వసూలు చేసినట్లు ఫిలిం వర్గాలు అంటున్నాయి. రెండో రోజు కూడా ఇదే కలెక్షన్స్‌తో నడుస్తోందని… వారాంతానికి ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించే అవకాశముందని ఇండస్ట్రీ టాక్. వైష్ణవ్ తేజ్‌కు ఇది తొలి చిత్రం. తొలి చిత్రంతో ఇంత భారీ కలెక్షన్స్ సాధించిన తొలి హీరోగా వైష్ణవ్ తేజ్ చరిత్ర సృష్టించారని మెగా అభిమానులు అంటున్నారు. క్లాస్, మాస్‌ను కూడా ఆకట్టుకునేలా సినిమాను తీయడంలో దర్శకుడు సక్సెస్ అవడంతో థియేటర్స్ ప్రేక్షకులతో కిటకిటలాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పూర్తి లెక్కలు పరిశీలిస్తే ..
✦ నైజాం.. రూ.3. 08 కోట్లు
✦ వైజాగ్ రూ. 1. 43 కోట్లు
✦ ఈస్ట్ రూ. 0.98 కోట్లు
✦ వెస్ట్ రూ. 0.81 కోట్లు
✦ క్రిష్ణా రూ. 0.62 కోట్లు
✦ గుంటూరు రూ. 0.65 కోట్లు
✦ నెల్లూరు రూ. 0.35
✦ టోటల్ ఆంధ్రా రూ. 4. 87 కోట్లు
✦ సీడెడ్ రూ. 1. 35 కోట్లు
✦ నైజాం+ ఏపీ రూ. 9.3 కోట్లు
✦ ఓవర్సీస్ 34 లక్షలు
✦ కర్ణాటక.. 52 లక్షలు
✦ తమిళనాడు 16 లక్షలు
✦ఆర్ఓఐ.. 10 లక్షలు