క్రమంగా కరిగిన నిఫ్టి… లాభాల స్వీకరణ

లాభాల స్వీకరణతో పాటు లాంగ్‌ పొజిషన్స్‌ను స్వ్కేర్‌ ఆఫ్‌ చేసుకోవడంతో నిఫ్టి నష్టాల్లో ముగిసింది. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి ఆ తరవాత కొనుగోలుకు ఎక్కడా ఛాన్స్‌ ఇవ్వలేదు. మిడ్‌ సెషన్‌ తరవాత ఓసారి కొనుగోలు ఛాన్స్‌ ఇచ్చినా… మరో పతనానికి అది దోహదపడిందే కాని…నిఫ్టి కోలుకోలేదు. 14,950-15,300 మధ్య నిఫ్టి అటుఇటూగా ట్రేడవుతోందని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. 15,300 బ్రేకౌట్‌ అవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇప్పటిదాకా రాలేదని వీరి వాదన. పైగా అసెంబ్లీ ఎన్నికలు ఏవీ బీజేపీకి అనుకూలంగా లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు పెరగడంతో దాదాపు అన్ని కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా చమురు ధరలు పెంచడం లేదు. కాని ఆ మేరకు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నష్టపోతున్నాయి. దీంతో ఎన్నికల తరవాత ప్రభుత్వం రేట్లు తగ్గిస్తుందా అన్న అనుమానం కూడా మార్కెట్‌ను పీడిస్తోంది. ఈ స్థాయి క్రూడ్‌ ధరలతో ఆపరేటింగ్‌ మార్జిన్లను కాపాడటం కష్టమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. నిఫ్టి ఇవాళ గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 400 పాయింట్లు క్షీణించింది. 15,336 నుంచి 14,953 అంటే 380 పాయింట్లు క్షీణించిందన్నమాట. క్రితం ముగింపుతో పోలిస్తే 144 పాయింట్ల నష్టంతో 15,030 వద్ద ముగిసింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
బీపీసీఎల్‌ 459.10 3.05
ఐఓసీ 101.40 2.58
పవర్‌గ్రిడ్‌ 220.00 2.25
JSW స్టీల్‌ 417.75 0.91
టైటాన్‌ 1,483.00 0.80

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
బజాజ్‌ ఆటో 3,751.00 -3.01
అదానీ పోర్ట్స్‌ 723.25 -2.97
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 711.80 -2.67
ఎస్‌బీఐ లైఫ్‌ 915.70 -2.66
హిందాల్కో 331.50 -2.60

Related Articles