ప్రజాస్వామ్య పునరుద్దరణను కోరుతున్న ఉద్యమకారుల మృతదేహాలపై మయన్మార్ సైనిక దినోత్సవం జరిగింది. శనివారం మయన్మార్ సైనిక దినోత్సవం. ఆ దేశంలో సైనిక కుట్ర జరిగినప్పటి నుంచి అత్యంత భారీ రక్తపాతం శనివారమే జరిగింది. సైన్యం శనివారం ఒక్కరోజే 100 మందికి పైగా నిరసనకారులను కాల్చి చంపింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. యాంగాన్‌కు చెందిన ఓ స్వతంత్ర పరిశోధకుడు ఈ సంఖ్యను వెల్లడించారు. 20 కిపైగా నగరాల్లో సైనికులు మానవ హననానికి పాల్పడ్డారని తెలిపారు. మయన్మార్ న్యూస్ ఛానళ్లు కూడా దాదాపు ఇదే సంఖ్యను వెల్లడించాయి. సైన్యం చర్యలను పలు దేశాలు ఖండించాయి.